ఎన్నికల నేపథ్యంలో 11న పాఠశాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
- 13 Views
- admin
- April 9, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి———————–
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భాస్కర్———————–
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 11వ తేదీ గురువారం జరగనున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు,ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె భాస్కర్ తెలిపారు. 11వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంత మండలాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ జరగనున్నదన్నారు. పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, పాఠశాలలకు పదో తేదీ బుధవారం కూడా సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వేసుకునే విధంగా అవకాశం కల్పించాలన్నారు.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు 4 గంటల వెసులుబాటు కల్పించించాలి
అత్యవసర సర్వీసుల లో పనిచేసే సిబ్బందికి మరియు షిఫ్ట్ డ్యూటీ లో పనిచేస్తున్న సిబ్బందికి తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వారికి వెసులుబాటు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటింగ్ వేసే సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల లోపు వారు ఓటు హక్కును వినియోగించు కొనడానికి వారు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి రావడానికి వీలుగా నాలుగు గంటల సమయం కేటాయించాలన్నారు. భారత ఎన్నికల నియమ నియమావళిని ఉల్లంఘించి వారి సంస్థలలో పనిచేస్తున్న సిబ్బందిని ఓటు వేయకుండా అడ్డంకులు కలిగించినా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగిం చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.


