రాహుల్ హామీ వల్ల భారత్ మరో వెనిజులా అవుతుందా?
- 14 Views
- admin
- April 10, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
————-ప్రత్యేక ప్రతినిధి, ఫీచర్స్ ఇండియా—————-
వెనిజులా ఒక పెద్ద దేశం. యుపి, బీహార్, పంజాబ్, హర్యానా, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల కన్నా పెద్దది. జనాభా ఎంత ఉంది? ఢిల్లీ ఎన్సీఆర్ (డిల్లి) జనాభా అంత మాత్రమే. అంటే 35 మిలియన్లు మాత్రమే. వెనిజులాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. సారవంతమైన భూమి, విస్తారమైన వర్షం, వందల కొలది చిన్న నదులు మరియు వేల మైళ్ళ పొడవైన బీచ్.
ఇంతటి సారవంతమైన భూమి, విస్తారమైన నీరు కలిగి ఉన్నప్పటికీ, మనుషులు దాదాపు నరమాంస భక్షకులుగా మారిన ఈ దేశంలో నేడు చాలా ఆకలి విలయం సృష్టిస్తుంది. ఈ దేశంలో పంటలు, పండ్లు, కూరగాయలు, పాడి, పౌల్ట్రీ, చేపలు పట్టడం వంటివి ఏవిూ లేవు.
వారు ఇంత తక్కువ జనాభా ఉన్న విశాల దేశం కోసం గోధుమ, వరి మరియు కూరగాయలు పండించలేక పోతున్నారు. అక్కడ పశువుల మేతకు మిలియన్ల హెక్టార్లు సారవంతమైన భూములు ఉన్నాయి. వెనిజులాలో కొన్నైనా ఆవులు, గేదెలు, గొర్రెలు పశుగ్రాసం లేక పోవటంతో పశుపోషణ లేక పశుజాతి అంతరించి అక్కడ జనానికి మాంసాహారాన్ని సైతం అందించలేకపోతుంది ప్రభుత్వం. నదులు మరియు మహా సముద్రాలలో చాలా మత్య సంపద ఉంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు వెనిజులా ఆకలితో నకనక లాడుతుంది.
అసలు వెనిజులా ఇలా
కావటానికి నేపధ్యం ఏమిటి?
రెండో ప్రపంచ యుద్ధం తరువాత, ప్రపంచంలోని చమురు కోసం విపరీతమైన గిరాకీ ఉండటంతో, ధరలు తారస్థాయికి వెళ్ళటంతో వెనిజులా ఆ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంది. 1945లో దేశం రోజుకు ఒక మిలియన్ బారెల్స్ చమురును ఉత్పత్తి చేసింది. అత్యంత సంపద పోగు పడటంతో ప్రభుత్వం దాని పౌరులకు ఉచితంగా ఆహార పదార్ధాలనుండి విలాస వస్తువులవరకు ఏదీ వదల కుండా పంపిణీ చేయడం ప్రారంభిం చింది. దేశంలోని ప్రతి పౌరునికి కాలు కిందపెట్టకుండా ఉచిత సేవ ఉచితాను చితాలు మరచి దేశ శ్రేయస్సు వదిలేసి ప్రభుత్వం అందించింది. చమురు బదులుగా, వస్తువులను ప్రపంచవ్యాప్తం దిగుమతి చేసుకుంది. రేషన్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, మందులు, యంత్రములు మరియు వస్త్రాలు, ప్రతిదీ చమురుకు బదులుగా దిగుమతి అయ్యాయి, వాటినే ప్రభుత్వం తన పౌరులను ఉచితంగా అందజేసింది.
50వ మరియు 60వ దశకంలో, వెనిజులా అవసరాలు తీర్చటానికి ప్రపంచ దేశాలన్నీ తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి కష్టపడి పనిచేయగా ? అప్పుడు ఆ దేశం సూది కూడా ఉత్పత్తి చేయలేదు. వారెంత సుఖజీవనం చేశారో తెలుసా? విస్థారమైన భూ, జల తదితర ప్రకృతి వనరులున్నా కూడా ప్రజలు సోమరిపోతులై – యూరోప్ నుండి క్యాబేజీ మరియు టమోటాలు వంటి వస్తువులని కూడా దిగుమతి చేసుకున్నారు.
వెనిజులా చాలా అందమైన దేశం. సరిగా ప్రణాళిక రచించి ఉంటే వారికి పర్యాటక పరిశ్రమ అద్భుతంగా అభివృద్ధి చెంది ఉండేది. ఇప్పుడసలు పరాటకమే అక్కడ లేదు. ఇప్పుడు వెనిజులాకు పర్యాటకులు పొరపాటున వెళ్లినట్లయితే, ఎవరూ ఒక గ్లాసు నీటిని కూడా అందించే పరిస్థితి లేదంటున్నారు. సాధారణంగా ఇటువంటి విలాస వంతమైన దేశాల్లో విదేశీయులు ఉపాధి కోసం వస్తారు.
కానీ ఈ దేశంలో ఉచిత సేవ ఉండటం వలన, అన్ని పార్టీలు మరియు వెనిజులా ప్రజలు కూడా దేశంలో విదేశీయుల ప్రవేశానికి సముఖంగా ఉండకపోవటం దానికి కారణం ఏమిటంటే, విదేశీయులు వారి ఉచిత సేవను ఎందుకు పొందాలి? ఆనే దుర్మార్గపు ఆలోచనే. ఫలితంగా పౌరులు జీవనం కోసమైనా వ్యవసాయం, ఇతర పరిశ్రమలు కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి విదేశాలనుంచి కార్మికులను దిగుమతి చేసుకోవడాన్నికూడా ప్రభుత్వం అనుమతించ లేదు.
అందువల్ల, దేశంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. పర్యాటకం కూడా. 70లలో, ఒక ప్రయాణికుడు వెనిజులా సందర్శించ డానికి వచ్చినట్లయితే వారు అతన్ని అనుచితంగా అనేదేమంటే ”ఫ II క్ ఆఫ్” అంత అగౌరవ పరిచే వ్యవస్థ అది.
చివరకు కరాకస్ నగరం – వెనిజులా రాజధాని, ప్రపంచంలో అత్యంత అసురక్షిత నగరం అంటే ప్రమాధకరం అన్నమాట. ఫ్రజలు ఒకరినొకరు నరికేసుకొని నరమాంస బక్షకులుగా జీవిస్తున్నారు. వన్ ప్లేట్ భోజనం చేయాలంటే 1.5 మిలియన్ బోలివర్ ఖర్చు అవుతుంది. ఒక్క రొట్టె ముక్కకే అమ్మాయిలు వారి శరీరం అమ్మేసు కుంటున్నారు. ఒక కండోం కొనుక్కోవాలంటే వందల కొలది బోలివర్స్ ఖర్చవుతాయి.
అలాంటి ప్రకృతితో సారవంతమైన జలాలతో విలసిల్లినా విస్తారమైన అంత పెద్ద దేశం జస్ట్ 3.5 కోట్ల (35 మిలియన్లు) ప్రజలకు గోధుమలు ఎలా పండించాలో నేర్ప లేదు? నేడు వెనిజులా ప్రభుత్వం మన భారత్ లోని పంజాబ్ రాష్ట్రం నుండి కేవలం 1000 మంది రైతులను మాత్రమే ఆహ్వానించి వారికి అవసరమైన యంత్రాల అందిస్తే కేవలం ఆరంటే ఆరు నెలల్లో వెనిజులా దేశం మొత్తానికి తినడానికి తగినంత కూరగాయలు, పండ్లు, పాలను ఆహార పంటలను ఉత్పత్తి చేస్తారు.
అక్కడ శృంగారం ఒక పెద్ద వినిమయవస్తువు
భారతదేశంలో, ఒక కపుర్తాల జిల్లా నుండి లభ్యమయ్యే పుచ్చకాయ ఊత్తర భారత అవసరాలను తీరుస్తుంది. అంతటి సమర్ధులు మనరైతులు. అసలు సమస్య ఏమంటే ప్రభుత్వం దాని పౌరులకు ఇటువంటి ”ఫ్రీ-బీస్” ఎందుకు అందించాలి? దేశ ప్రజలను అసమర్థంగా మరియు బాధ్యతా రహితమైనదిగా ఎందుకు చేస్తున్నారు? దేశంలో చాలా ఆకలి ఉన్నప్పుడు, ప్రజలు వారి పెరటిలో పండ్లు మరియు కూరగాయల విత్తనాలను విసిరినా, తరువాత రెండు నెలల్లో చాలా పండ్లు మరియు కూరగాయలు లభించి ఏ ఆకలి కేకలు వినిపించనంతగా అభివృద్ధి జరుగుతుంది.
గత 10 సంవత్సరాలుగా పైగా వెనిజులా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అయినప్పటికీ, అటు ప్రభుత్వం గాని ఇటు ప్రజలు కాని సోమరితనంతో భాధ్యతగా ప్రవర్తించక పోవటమే వెనిజులా దుస్థితికి కారణం.
ఇక రాహుల్ గాంధీ హామీ గురించి..
నేడు, రాహుల్ గాంధి తనను గెలిపిస్తే 50 మిలియన్ల పేద కుటుంబాలకు నెలకు రూ.6000/- అంటే సంవత్సరానికి రూ.72000/- ఉచితంగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వెనిజులాలో కేవలం 35 మిలియన్ల మంది మాత్రమే ఉన్నారు. రాహుల్ గాంధి 250 మిలియన్ల మంది ప్రజలను ఫ్రీ ”ఫ్రీలాడర్స్” ఉచితాల విూద బ్రతికే నిత్య సోమరి పోతులుగా తయారు చేయాలనుకుంటున్నారన్నమాట. దీన్నిబట్టి చూస్తే భారత్లో ఏడుకు పైగా వెనిజులాలు ఉత్పత్తి అవుతాయన్నమాట!
ఒకవేళ అదే జరిగితే రాహుల్ గాంధి కాంగ్రెస్ ఒక వెనిజులా సృష్టించటానికి అంటే రూ.360000 కోట్లు (3.6 ట్రిలియన్ డాలర్లు) బడ్జెట్ అవసరం. ఆయన ప్రణాళిక ఎంత మూర్ఖమో? దీన్నిబట్టి అర్థమౌతుంది. భారతదేశాన్ని ఒక వెనిజులాగా మార్చడానికి రాహుల్ గాంధి కంకణం కట్తుకున్నట్లున్నారు. ఈ దుర్మార్గ యఙ్జానికి ప్రాంతీయ ప్రతి పక్ష పార్టీలన్నీ పోటాపోటీగా ఎవరికివారు మద్దతు తెలుపుతూ సుభిక్ష భారతావనిని బిచ్చమెత్తుకునే దుర్బిక్షదేశంగా మార్చాలని అనుకుంటున్నట్టుంది. ఈ విషయం ఆలోచించాల్సిందే మరి!


